Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిగ్గుండాలి చంద్రబాబూ... మోహన్ బాబుకు మద్దతు పలికిన కన్నా లక్ష్మీనారాయణ!

  • మోహన్ బాబు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • ఆయన పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు
  • ట్విట్టర్ లో వెల్లడించిన కన్నా లక్ష్మీనారాయణ
తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సిగ్గుపడాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. తిరుపతిలో మోహన్ బాబు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా, తన ట్విట్టర్ ఖాతాలో కన్నా స్పందించారు. "ప్రజాస్వామ్య విలువలు లేని నువ్వు 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకోడానికి సిగ్గుపడాలి. సినీనటుడు మోహన్ బాబు గారు విద్యార్థుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటానికి బీజేపీ పూర్తి మద్దతు తెలియచేస్తోంది. విద్యార్థుల కోసం పోరాడితే హౌస్ అరెస్ట్ చేస్తావా? ఇదేనా నీ దిక్కుమాలిన అనుభవం?" అని ఆయన ప్రశ్నించారు.
Mohanbabu
BJP
Kanna Lakshminarayana
Twitter

More Telugu News